ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అంచనాలకు అనుగుణంగానే కొరటాల ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర ఫస్ట్ పార్ట్. ఈ నెల 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.విడుదల తేదీ దగ్గరపడుతోన్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ల వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే నార్త్‌తో పాటు సౌత్‌లో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటు మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు కొరటాల శివ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దేవర రిలీజ్ విషయంలో టెన్షన్ పడుతున్నారా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. టెన్షన్ కాదు.. ఎగ్జామ్ రాసిన విద్యార్థికి ఉండే ఫీలింగ్ ఇది. ఏదైనా టీమ్ ఎఫెక్టే. నేను సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను ఒకేలా తీసుకుంటానని కొరటాల చెప్పుకొచ్చారు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా దురదృష్టకరమని. మూడేళ్ల కష్టాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలనుకున్నామని, ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ రాసుకున్నామని అయితే ఈవెంట్ రద్దు కావడం ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.ఇక చిరంజీవితో తన అనుబంధాన్ని కూడా పంచుకున్నారు కొరటాల. తమ మధ్య ఎప్పుడూ మంచి అనుబంధం ఉందని తెలిపిన శివ.. 'ఆచార్య' ఫలితం తర్వాత తనకు ఫస్ట్ మెసేజ్ చేసింది చిరంజీవే అని తెలిపారు. 'నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకురావాలి' అని మెసేజ్ చేసినట్లు మెసేజ్ చేశారు. అయితే కొందరు మాత్రం చిరు మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అసలు విషయం బయటపెట్టారు