శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన 2018లో అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన మూవీ 'స్త్రీ'. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన 'స్త్రీ2' మూవీ ఈ ఇయర్ ఆగష్టు 15న రిలీజైన విజయం సాధించింది. ఫస్ట్ డే నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే ఈ చిత్రం రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఫస్ట్ డే ఈ చిత్రం రూ. 64.80 కోట్ల నెట్ వసూళ్లతో హిందీలో సంచలనం రేపింది.
ఈ మూవీ ఓవర్సీస్ ఇతర ప్రాంతాల్లో కలిపి రూ. 92 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అంతేకాదు 'స్త్రీ 2' మన దేశంలో హిందీ వెర్షన్ లో ఇప్పటి వరకు రూ. 605.72 కోట్ల నెట్ వసూళ్లతోమన దేశంలో హిందీ వెర్షన్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ప్రస్తుతం ఈ మూవీ మన హిందీ బాక్సాఫీస్ దగ్గర టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు జవాన్, గదర్ 2, పఠాన్, బాహుబలి 2 సినిమాలున్నాయి. బాహుబలి సినిమా బాలీవుడ్ లో మన దేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ రికార్డును దాదాపు 6 ఇయర్స్ తర్వాత షారుఖ్ 'పఠాన్' మూవీ క్రాస్ చేసింది.అటు పఠాన్ రికార్డును సన్ని దేవోల్ 'గదర్ 2' క్రాస్ చేసింది.ఆ తర్వాత ఆ రికార్డును 'జవాన్' బ్రేక్ చేసింది.తాజాగా ఈ నాలుగు బ్లాక్ బస్టర్ మూవీల రికార్డులను ఈజీగా శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' క్రాస్ చేసింది. అంతేకాదు ఇప్పటికే రూ. 605.72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. మొత్తంగా బాలీవుడ్ లో హిందీ వెర్షన్ లో రూ. 600 కోట్ల నెట్ వసూళ్లను
త్వరలో రూ. 600 కోట్ల నెట్ వసూళ్ల దిశగా ప్రయాణం చేస్తుంది. మన దేశంలో హిందీ వెర్షన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పట్లో 'స్త్రీ 2' రికార్డును బ్రేక్ చేయడం బడా హీరోలకు కూడా సాధ్యం కాదు. ప్రభాస్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో కలిపి రూ. 1170 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ వెర్షన్ మన దేశం వరకు రూ.300 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం. మొత్తంగా హిందీలో మాస్ బెల్ట్ ఏరియాల్లో 'స్త్రీ 2' బాక్సాఫీస్ ను శాసించింది. మొత్తంగా మూవీ నచ్చితే హిందీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని మరోసారి 'స్త్రీ 2' మూవీతో ప్రూవ్ అయింది. ఒక మహిళా నేపథ్య హార్రర్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలుసుకుంటున్నారు.