తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణం. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవర్ని వదిలిపెట్టకూడదు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు చేసిన తప్పు వేంకటేశ్వర స్వామి చూస్తున్నాడు.’ అంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్‌గా ఉండమంటే ఎలా? ఇతర మతాల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తారా? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. లౌకికవాదం అంటే ప్రతీ మతాన్ని గౌరవించడం. అంతేగానీ పక్షపాతంతో వ్యవహరించొద్దు. నేను హిందూ మతంలో పుట్టకపోయినా.. ఈ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నాకు అన్ని మతాలు సమానమే. హిందూ మతాన్ని అవమానించొద్దు.. చులకనగా మాట్లాడొద్దు. దాన్ని అగౌరవపరిస్తే సహించొద్దు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడమంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీయడమే. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. వేంకటేశ్వరస్వామి చూస్తున్నాడు’ అని ఖుష్బూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.