కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీ పై కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ . కేటీఆర్ ను విమర్శిస్తూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది.తనపై కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని. ఇదంతా కేటీఆర్ వెనకుండి నడిపిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దుబాయ్ నుంచే ఆపరేట్ చేయిస్తున్నారన్నారు. మహిళలంటే ఆయనకు చిన్న చూపని, సినీ పరిశ్రమలోని హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేయించారంటూ దిమ్మతిరిగే ఆరోపణలు చేశారు సురేఖ. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణమని, ఆయన కారణంగానే చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారంటూ సురేఖ ఆరోపించడం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది.
కొండా సురేఖ మీద సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, నాగార్జున, ప్రకాష్ రాజ్ , సమంత ఇలా చాలా మంది స్పందించారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల పై మండిపడ్డారు. “నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం.
ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద. అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. KTR ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి.? అని అన్నారు ఆర్జీవీ. అలాగే ” సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము” అని సోషల్ మీడియాలో ఆర్జీవీ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే కొండా సురేఖ దంపతుల మీద తెరకెక్కించిన విషయం తెలిసిందే..
4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం
ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద… https://t.co/rMpA6UL798
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa