యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన్మధుడు – 2. నాగ్ సరసన అదరగొట్టే బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ముగ్గురు ముద్దుగుమ్మలైన కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడలు స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. 2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రానున్న ఈ సినిమాపై అటు టాలీవుడ్ లోను ఇటు అక్కినేని ఫ్యాన్స్ లోను ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక నాగ్ ని మరొక్కసారి మన్మధుడి పాత్రలో చూద్దామా అని ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి కాసేపటి క్రితం తీపి కబురు చెప్పింది చిత్ర యూనిట్.
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ విడుదల చేసారు. ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలుండడంతో ఒకవేళ ఎల్లుండి విడుదలయ్యే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమా నాగ్ కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే ఇంకొద్ధిరోజులు వేచి చూడాల్సిందే….!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa