పూజా కుమార్ హీరోయిన్ గానే ఇండస్ట్రీకి వచ్చినా పెద్ద గుర్తింపు ఉన్న పాత్రలనీ, బయట జనం లో తనకంటూ కొందరు ఫ్యాన్స్ నీ మాత్రం సంపాదించుకోలేక పోయిందీ ముదురు భామ. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన పూజా కుమార్ మనదగ్గర మాత్రం కమల్ హాసన్ తీసిన విశ్వరూపం లో పాత్ర తో కాస్త పాపులర్ అయ్యింది.పూజాకుమార్ కుటుంబం చాలా సంవత్సరాలు క్రితం ఆమెరికాకు వలస వెళ్ళారు. అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుని నటిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా గుర్తింపు సంపాదించుకుంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో కూడా ప్రావీణ్యం బాగానే ఉంది.
న్యూక్లియర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్రలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌తో విశ్వరూపంలో నటించి మెప్పించింది హీరోయిన్ పూజా కుమార్. పూజా నటనకు ముగ్ధుడైన కమల్ వెంటనే తను నటిస్తూ నిర్మించిన ఉత్తమవిలన్‌లో సినిమా హీరోయిన్ పాత్రను ఆఫర్ చేశారు. ఆ పాత్రలో కూడా కమల్ కు ధీటుగా నటించి మంచి మార్కులే కొట్టేసింది.ఇప్పుడీ భామ వయసు 40 దాటింది. రాజశేఖర్ లేటెస్ట్ రిలీజ్ పీఎస్వీ గరుడవేగ చిత్రంలో.. హీరో భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఏజ్ కాస్త ఎక్కువ కావడంతో.. ఈమెకు వచ్చే రోల్స్ కూడా ఎక్కువగా భార్య పాత్రలే. వాటిలోనే నావెల్టీ అంటూ ఏదో ఒకటి చేసేస్తూ.. కెరీర్ ని బాగానే లాక్కొచ్చేస్తోంది.అటు హాలీవుడ్ నుంచి మొదలుపెట్టి.. ఇటు కోలీవుడ్.. బాలీవుడ్ లను కూడా బాగానే కవర్ చేసేస్తోంది. అసలీ ఏజ్ లో హీరోయిన్ పాత్రలు రావడమే ఓ విచిత్రం.
అలాంటిది ఏజ్ ను పక్కన పెట్టి ఎక్స్ పోజింగ్ కూడా చేసేయడం అంటే చిన్న విషయమేమీ కాదు. ప్రస్తుతం పీఎస్వీ గరుడవేగ సినిమా కోసం తెగ ప్రమోషన్స్ చేస్తున్న పూజా కుమార్.. ఇలా కనిపించేసింది.పైగా 40 ఏళ్లు అనే విషయం చెబితే తప్ప.. చూస్తే అర్ధం కావడం లేదు కదా అన్నది వారి వెర్షన్. ఎవరి ఒపీనియన్ వారిది. అన్నిటినీ యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ.. నిజ్జంగానే పూజా కుమార్ ధైర్యాన్ని మాత్రం పొగడాల్సిందే. త్వరలో కమల్ తో కలిసి విశ్వరూపం2 చూపించబోతోంది ఈ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa