జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నవంబర్ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు మిగిలిన భాషల్లోనూ ఆ రోజు నుంచే దేవర స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర మూవీ.. 16 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.తారక్ సోలో హీరోగా నటించి ఈ మార్క్ దాటిని తొలి సినిమాగా దేవర నిలిచింది. గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ రూ.1200 కోట్లకుపైనే వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా దేవర ఇలా రూ.500 కోట్లకుపైగా వసూలు చేయడం మాత్రం సాధారణం విషయం కాదని చెప్పొచ్చు.
ఓటీటీ హక్కులకు రికార్డు ధర
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమాపై మొదటి నుంచీ ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.100 కోట్లకుపైగా చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.