ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోలెక్స్ పాత్రపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 02:19 PM

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. 2022లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ లోని పాటలు, కమల్ పాత్ర, ప్రతీకార కథ అన్నీ జనాలకు నచ్చాయి.ముఖ్యంగా ఈ మూవీ చివరి ఐదు నిమిషాల్లో సూర్య ప్లే చేసిన రోలెక్స్ పాత్ర హైలెట్ అయ్యింది. ఇందులో రోలెక్స్ అనే విలన్ పాత్రలో కనిపించాడు సూర్య. ఈ పాత్ర తెరపై చివరి రెండు నిమిషాలు మాత్రమే కనిపించినప్పటికీ.. జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆ క్యారెక్టర్‌ని పెట్టుకుని సెపరేట్ చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ విషయంపై సూర్య స్పందించాడు.సూర్య నటించిన కంగువ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న సూర్యకు ఓ ఇంటర్వ్యూలో రోలెక్స్ పాత్ర గురించిన ప్రశ్న ఎదురైంది. . ‘రోలెక్స్’ భవిష్యత్తు ఎలా ఉంటుంది? రోలెక్స్‌ను మళ్లీ తెరపై చూడగలమా ? యాంకర్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సూర్య. . ‘రోలెక్స్ పాత్ర కోసం అరరోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే అరరోజు కష్టపడితే అభిమానుల నుంచి ఇంత ప్రేమ, మద్దతు లభిస్తుందని ఊహించలేదు. ‘రోలెక్స్’ పాత్రను బేస్ చేసుకుని ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టాండ్ ఎలోన్ గురించి నాతో చర్చించారు. ఈ విషయంపై రెండుసార్లు సమావేశమయ్యాం. కానీ ఏదీ ఖరారు కాలేదు’ అని అన్నారు.ఇక ముందు ‘రోలెక్స్’ చేయాలా లేక’ఇరుంబు కై మాయావి’ చేయాలా అనేది నిర్ణయించుకోవాలి. ‘ఇరుంబు కై మాయావి’ చిత్రం చేయి కోల్పోయిన ఓ సూపర్‌హీరో కథ. ఈ లో సూర్య హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అయితే ఆ కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఖైదీ 2 గురించి కూడా చర్చ మొదలైంది, ఆ లో రోలెక్స్, కార్తీ ఇద్దరు కలిసి నటిస్తారా అని మరోసారి అడగ్గా.. ఇప్పుడేం చెప్పలేమని..కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని అన్నారు. సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుంది. దిశా పటాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com