సాధారణంగా పెళ్లిలో డిజె సౌండ్లకు స్టెప్పులేయడం సర్వసాధారణం అయితే ప్రముఖుల పెళ్ళిలో స్టార్ సెలబ్రిటీలు చేసే సందడి అంతా ఇంతా కాదు. అందునా సంగీత్ వేడుకలలో అయితే ఇక చెప్పనవసరమే ఉండదు. కాగా . డెహ్రాడూన్‌లోని ఔలీ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు టీవీ, బాలీవుడ్ నటులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్ళి వేడుకకు ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా హాజరయ్యి తన అందచందాలతో అలరించడంతో పాటు ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలో ‘షీలా కీ జవానీ’ పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. బుల్లితెర నటి సురభీ సైతం ఈ వేడుకలో పాల్గొని పాటలకు చేసిన నృత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సూపర్ కత్రినా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa