నటుడు ధనుష్ తీరును తప్పుబడుతూ నయనతార ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సైతం ధనుష్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ద్వేషాన్ని కాదు.. ప్రేమను పంచండి. కనీసం మీరంటే పడి చచ్చిపోయే అమాయక అభిమానుల కోసమైనా మారండి. ఇప్పటికైనా మీరు మారాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ కాగా వెంటనే డిలీట్ చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa