ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల జోడి ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. తాజాగా దేవర నుంచి వదిలిన చుట్టమల్లే అంటూ సాగే రెండో పాటతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంట కెమిస్ట్రీ అదిరిపోయిందని ఈ లిరికల్ వీడియోని చూస్తే తెలుస్తుంది. రొమాంటిక్ మెలోడీ పాటలో రామజోగయ్య సాహిత్యం అదిరిపోయింది. అనిరుధ్ బాణీ వినసొంపుగా ఉంది. శిల్ప గాత్రం కూడా ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాట లిరిక్స్ ఇవే..
పల్లవి
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..
అస్తమానం నీలోకమే నా మైమరపు..
చేతనైతే నువ్వే నన్నాపు..
రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా..
నీ కోసం వయసు వాకిలి కాశా..
రా.. నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా..
నీ రాకకు రంగం సిద్దం చేశా..
ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..
ఆహా.. ఎంత వినసొంపుగా ఉందో.. దేవర రెండో పాట విన్నారా?
చరణం 1
మత్తుగా మెలేసింది.. నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి..
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి..
ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరి..
చెయ్యరా ముద్దుల దాడి..
ఇష్టమే నీ సందడి..
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి..
రా.. ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే..
నీ కౌగిలితో నన్ను సింగారించు..
రా.. ఏ వెన్నెల జోలాలి..నన్ను నిద్దర పుచ్చట్లే..
నా తిప్పలు కొంచెం ఆలోచించు..
ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..
మొత్తానికి దేవర నుంచి ఫియర్ సాంగ్ తరువాత ఇలాంటి రొమాంటిక్ పాటను వదిలి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇది ఇన్ స్టంట్ అడిక్షన్‌లా ఉంది. ఈ పాటతో రింగ్ టోన్లు సెట్ అయ్యాయ్ అని అప్పుడే ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పల్లవి, చరణంలో రిపీట్ అయిన లిరిక్స్ మాత్రం అదిరిపోయాయ్ అని, మత్తెక్కించేలా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.