హీరోయిన్ అదితి దేవ్ శర్మ రెండో సారి తల్లయ్యారు. ఇవాళ ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. గతంలో ఆమెకు కుమారుడు జన్మించారు. కాగా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన 'గుండె ఝల్లుమంది' చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఓంశాంతి, బబ్లూ సినిమాల్లో నటించారు. అనంతరం పలు టీవీ షోలు, సీరియల్స్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa