పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్. కాగా ఈ మూవీ 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్‌ని ప్రత్యేకంగా నియమించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa