భారతీయ సినిమా రూపురేఖలు పూర్తిగా మారాయి. అనేక వైవిధ్యమైన కథలు తెరపై ఆవిష్కృతం అవుతున్నాయి. ఒకప్పుడు సాంఘిక చిత్రాలు మాత్రమే తీసిన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్‌ల, చారిత్రక చిత్రాల నిర్మాణం బాగా పెరిగింది. ఈ తరహా సినిమాలకు ప్రేక్షకులు ఆమోదిస్తున్నారు. మరోవైపు చారిత్రక లేదా వాస్తవిక కథా చిత్రాల్లో నటించే ఆర్టిస్టులు కొంత శ్రమించాల్సి వస్తోంది. ఈ తరం తారలకు పరిచయం లేని కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ చేయడం, కర్రసాము వంటి ప్రక్రియల్లో తర్ఫీదు పొందాల్సి వస్తోంది. ఇటీవలే బాహుబలి, రుద్రమదేవి కోసం అనుష్క ఇంకా తమన్నా ఈ విద్యలను నేర్చుకున్నారు. సైరా కోసం నయనతార కూడా ఫాలో అయింది. తాజాగా ఆర్‌ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ సైతం వీటిని నేర్చుకుంటోంది. ఎందుకంటే ఆమె ప్రధాన పాత్రలో అరుంధతి 2 పేరుతో సినిమా తెరకెక్కి స్తున్నారు. గ్లామర్ పాత్రలు చేసే ఆమెకు ఈ తరహా క్యారెక్టర్ చేయడం కొత్త. అయినప్పటికీ ఛాలెంజింగ్‌గా భా వించి, శిక్షణ తీసుకుంటోందని చిత్రబృదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa