ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంత్య‌క్రియ‌లు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2019, 02:40 PM

న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత విజ‌య నిర్మ‌ల బుధ‌వారం రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కొద్ది సేప‌టి క్రితం ఆమె పార్ధివ దేహాన్ని నాన‌క్ రామ‌గూడ‌లోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఈ రోజు స్వ‌గృహంలోనే విజ‌య నిర్మ‌ల భౌతిక కాయాన్ని ఉంచ‌నున్నారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు విజ‌య నిర్మ‌ల భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఫిలిం చాంబ‌ర్‌లో కొద్ది సేపు ఉంచ‌నున్నారు. ఆ త‌ర్వాత చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారం జరుగుతుంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa