నటి, గిన్నిస్ రికార్డు దర్శకురాలి విజయనిర్మల మరణం చిత్ర పరిశ్రమని విషాదంలో ముంచింది. ఆమె పార్టీవ దేహానికి పరిశ్రమలోని ప్రముఖులంతా విచ్చేసి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నటసార్వభౌమ సత్యనారాయణ సైతం కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా కృషణ ఇంటికి వచ్చి అందరినీ పరామర్శించారు. విజయనిర్మల లేని లోటు ఏ ఒక్కరూ తీర్చేలా లేరని అన్నారు. ఈ సందర్బంగా విజయ నిర్మల కుమారుడు నటుడు సీనియర్ నరేష్‌ని ఓదార్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa