ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 3 రోజుల్లోనే రూ.205 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో జవాన్ రూ.180Cr, యానిమల్ రూ.176Cr, పఠాన్ రూ.161Cr కలెక్షన్లు వచ్చాయి. అలాగే హిందీలో తొలి 3 రోజుల్లో రెండు రోజులు రూ.70Cr మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ మూవీ గురువారం రూ.72Cr, శుక్రవారం రూ.59Cr, శనివారం రూ.74Cr సాధించింది.