ఇన్‌స్టాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi). తన డైలీ రొటీన్, ఫిట్‌నెస్ విషయాలతోపాటు కుమార్తె విద్యా నిర్వాణకు సంబంధించిన విశేషాలను ఆమె తరచూ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘పీస్ (శాంతి)’’ అని క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీని కంటే ముందు ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో మరో పోస్ట్ పెట్టారు. 2024 చివరి దశకు వస్తోన్న సందర్భంగా ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేశారు. ఈ ఏడాదిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు అందులో రాసి ఉంది.
మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘అనగనగా ఓ ధీరుడు’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దొంగల ముఠా’, ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా?’, ‘దూసుకెళ్తా’, ‘దొంగాట’, ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో నటించారు. గత కొంతకాలంగా ఆమె ముంబయిలో ఉంటున్న విషయం తెలిసిందే. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడికి షిఫ్ట్ అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘ముంబయిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని ఆమె తెలిపారు.