కొన్ని రోజుల క్రితం తెలుగు రొమాంటిక్ డ్రామా 'రోటీ కప్డా రొమాన్స్' థియేటర్లలోకి వచ్చింది. నూతన దర్శకుడు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ A-రేటెడ్ చిత్రం కంటెంట్‌తో కొంత మంది ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈరోజు ఈటీవీ విన్‌లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగ, తరుణ్, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ మరియు ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ మరియు సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధృవన్, వసంత్ జి మరియు సన్నీ ఎంఆర్ సంగీతం అందించారు.