సినీ నటి సమంత తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే తన రాశికి 2025 ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తి పరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు’ అని ఆ పోస్ట్‌లో ఉండడంతో సమంత పెళ్లి చేసుకోబోతుందేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.