బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ కి "డాకు మాహారాజ్" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ టీజర్ కి భారీ రెస్పాన్స్ లభించింది. విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉన్నందున, మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా తొలి సింగల్ ని "ది రేజ్ ఆఫ్ డాకు" పేరుతో విడుదల చేసారు. లెజెండరీ నందమూరి బాలకృష్ణ నటించిన ఈ పాట సినిమాలోని ఇంటెన్స్ యాక్షన్ మరియు డ్రామాని పరిచయం చేస్తుంది. అనంత శ్రీరామ్ శక్తివంతమైన సాహిత్యంతో భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి రావ్ మరియు కె. ప్రణతి నుండి డైనమిక్ గాత్రాన్ని అందించిన ట్రాక్‌ను థమన్ ఎస్ స్వరపరిచారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందిని చౌదరి, రిషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమా పతాకంపై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12, 2025న విడుదల కానుంది.