టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా 1500 కోట్ల గ్రాస్ మార్క్‌తో ఇప్పటికే బాలీవుడ్‌లో మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది. 13వ రోజు నాటికి ఈ చిత్రం హిందీ ప్రాంతంలో 601 కోట్ల గ్రాస్ వాసులు చేసింది. రెండో మంగళవారం 19 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అసాధారణమైన 600 కోట్ల మైలురాయిని ఈ చిత్రం చేరుకుంది. ఈ చిత్రం ఇప్పుడు స్త్రీ 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను (627.02 కోట్ల గ్రాస్) అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే క్రిస్మస్ సెలవులు మరియు నూతన సంవత్సర వేడుకలు సినిమా విజయానికి మరింత ఆజ్యం పోస్తాయని భావిస్తున్నారు పోటీలో పెద్ద హిందీ విడుదలలు లేవు. పుష్ప 2 ఇప్పుడు 700 కోట్ల మార్క్, మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ ఛితంలో రష్మిక కథనాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్, సామ్ సిఎస్ మరియు ఇతరుల అదనపు సహకారాలతో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.