హీరో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయిక. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
‘హాయ్ డార్లింగ్స్. ప్రస్తుతం సాహో షూటింగ్ ఆస్ట్రియాలో జరుగుతోంది. గతంలో ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ చూడలేదు. అద్భుతంగా ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రభాస్‌తో పాటు కథానాయిక శ్రద్ధాకపూర్ కూడా ఉంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa