సీఎం రేవంత్ రెడ్డిని గురువారం కలుస్తున్నామని TSFDC చైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా సీఎంను కలిసేందుకు వస్తున్నారని చెప్పారు. TFDC తరఫున రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ఉండబోతుందని పేర్కొన్నారు. శ్రీతేజ్ గత మూడు రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని.. బాలుడి ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు TFDC తరఫున హీరోలు (Hero's), డైరెక్టర్లు (Directors), ప్రొడ్యూసర్లు (Producers), అల్లు అర్జున్ (Allu Arjun)తో సహా అందరూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలవబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంవో (CMO) నుంచి కూడా అనుమతి లభించిందని తెలిపారు. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించనున్నారని దిల్ రాజు స్పష్టం చేశారు.