ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా చేస్తే.. బ్లాక్ చేస్తానంటున్న అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2019, 10:54 AM

ప్రముఖ యాంకర్, నటి అనసూయ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొందరు వ్యక్తులు తనపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. అంతే కాదు.. అలా ఎవరైనా తనపై కామెంట్స్ చేస్తే... అలాంటి వారందర్నీ బ్లాక్ చేస్తానంది అనసూయ. ఇలా ఎవరినైనా బ్లాక్ చేసే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది. ట్విట్టర్ లో అనసూయ స్పందిస్తూ..‘వితండవాదానికి నా అకౌంట్(ట్విట్టర్) పేజీలో స్థానం లేదు. నా ట్విట్టర్ హ్యాండిల్ లో దురుద్దేశంతో అనుచిత కామెంట్లు చేస్తున్నవారందరినీ బ్లాక్ చేస్తున్నా. ఇది నా అకౌంట్. నేను ప్రశాంతంగా ఉండటానికి ఏది కావాలనుకుంటే అది చేసే హక్కు నాకు ఉంది’ అని అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేసింది. 


మరోవైపు అనసూయ నిర్మాతగా మారుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా అమెరికాలోని వాషింగ్‌టన్‌లో జరుగుతున్న 22వ తానా వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనసూయ. ఈ సందర్భంగా తన సన్నిహితులతో త్వరలో తాను నిర్మాతగా మారుతున్నానని చెప్పి చిన్న పాటి షాకే ఇచ్చారట. అంతేకాదు లో బడ్జెట్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనలో అనసూయ ఉందట. రంగస్థలం, క్షణం వంటి మూవీల్లో నటించి మంచినటిగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి యాంకర్‌గా, నటిగా ప్రూవ్ చేసుకున్న అనసూయ.. ఇపుడు నిర్మాతగా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa