ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 08:44 PM

'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, 'మంగళవారం' మూవీతో ప్రేక్షకులలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.ఇక ఇప్పుడు ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో 'వెంకటలచ్చిమి'గా పాన్ ఇండియా సినిమా చేస్తోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో 'వెంకటలచ్చిమి' మూవీ తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. ''వెంకటలచ్చిమి'గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించిందాన్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివెంజ్ స్టోరీతో కూడిన ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ''మంగళవారం' సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నా, నచ్చక రిజెక్ట్ చేశా కానీ డైరెక్టర్ ముని 'వెంకటలచ్చిమి' కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు 'వెంకటలచ్చిమి'గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్ట్ ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే తన సినిమాలతో యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో ఈ పాన్ ఇండియా సినిమాతో రానుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి వికాస్ బడిశా సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com