ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా ‘యానిమల్’తో సందీప్, హీరోగా ‘కల్కి 2898 ఏ.డీ’తో ప్రభాస్ హిట్లు కొట్టడంతో ఈ కలయికపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగ్ మేలో ప్రారంభమవుతుందని తెలిసింది. జూన్ నుంచి ప్రభాస్ షూటింగ్‌లో చేరనున్నారట. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ప్రభాస్ ఈ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇందులో విలన్‌గా సౌత్‌కొరియన్ యాక్టర్ డాన్ లీ నటించనున్నారని ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాక.. పూర్తయ్యేవరకు మరో సినిమా షూట్‌లో పాల్గొనకూడదని ప్రభాస్‌ను కోరారట సందీప్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa