సంక్రాంతి కానుకగా గత నెల 14న థియేటర్లలోకి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై 20 రోజులు కావొస్తున్నా కలెక్షన్లు మాత్రం స్టడీగా కొనసాగుతున్నాయి. వీకెండ్స్‌లో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వసూళ్ల పరంగా ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వచ్చినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ ఆల్బమ్‌లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa