ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రోచేవారెవరురా' సినిమా విషయాల్ని పంచుకున్న వివేక్ ఆత్రేయ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2019, 06:21 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'బ్రోచేవారెవరురా' మంచి విజయాన్ని సాధించింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.

"ఈ సినిమాలో 'మిత్ర' పాత్ర కోసం నివేదా థామస్ ను అనుకుని ఆమెకి కథ చెప్పాను. ఎంత మాత్రం ఆలోచించకుండా ఆమె ఓకే చెప్పేసింది. ఆ రోజు నుంచి కూడా ఆమె ఈ కథపై ఎంతో నమ్మకాన్ని కనబరుస్తూ వచ్చింది. ఈ కథపై ఆమెకి గల నమ్మకాన్ని చూసినప్పుడు ఒక్కోసారి నాకు భయమేసేది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనే టెన్షన్ నాలో కలిగేది. తన పాత్రకి డైలాగ్స్ తక్కువైనా, కళ్లతోనే ఆమె హావభావాలను పలికించింది. నివేదా పాత్రకి ప్రశంసలు దక్కడంతో, ఆమె నమ్మకాన్ని నిలబెట్టినందుకు తేలికగా ఊపిరి పీల్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa