ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆమె' కష్టమయితే ఎటు పోలేదు..!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2019, 04:15 PM

అమలా పాల్‌ లాంటి పాపులర్‌ నటి కథానుసారం ఒక నలభై అయిదు నిమిషాల పాటు నగ్నంగా కనిపించడమంటే మాటలు కాదు. ఏ పేరున్న హీరోయిన్‌ అయినా ఈ కథ వినగానే ఆమడ దూరం పారిపోతుంది. అలాంటిది అమల నగ్న సన్నివేశాలలో బాడీ డబుల్‌ కానీ, కాస్టూమ్‌ కానీ అవసరం లేకుండా నిజంగా చేస్తానని ముందుకొచ్చింది. ఇలాంటి పాత్ర చేసిన తర్వాత తనకి ఎలాంటి పాత్రలు వస్తాయనేది అనుమానమే. మళ్లీ హీరోలు తనతో పని చేస్తారనేది కూడా డౌటే. అయినా కానీ రిస్క్‌ చేసిన అమల చివరకు 'ఆడై' (ఆమె) విడుదలకి ఇబ్బంది ఏర్పడితే తన పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసింది. 


తిరిగి డబ్బులు వస్తాయో లేదో తెలియని ఈ చిత్రానికి అమల అన్నీ త్యాగం చేసింది. ఆమె కష్టమయితే వృధా పోలేదు. ఈ చిత్రం చూసిన వారంతా అమలని మెచ్చుకుంటున్నారు. సినిమా కూడా బాగానే వుందని కితాబులు ఇస్తున్నారు. అయితే ఈ కష్టానికి, శ్రమకి, రిస్కుకి తగ్గ కమర్షియల్‌ రిజల్ట్‌ కూడా వస్తే బాగుంటుంది. అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా ఈ చిత్రానికి ఇంతవరకు చెప్పుకోతగ్గ స్పందన లభించలేదు. విడుదల ఆలస్యం కావడం కూడా ఈ చిత్రానికి సమస్యగా మారిందని భావిస్తున్నారు. టాక్‌ బాగుంది కనుక ఆమె పుంజుకుని అమలకి మరచిపోలేని హిట్టుని కూడా అందిస్తుందనే ఆశిద్దాం.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa