టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా ఎంపీ సంతోష్ గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. ఈ క్రమంలో ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరో నితిన్ తన పెరట్లో ఓ మొక్కని నాటాడు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ అనే కార్యక్రమం మంచి ప్రయత్నం. ఇలాంటి సామాజిక బాధ్యతలో నన్ను భాగం చేసినందుకు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రపంచాన్ని అందంగా మార్చడంలో మా బాధ్యతలు గుర్తుచేసే ఏ సవాలునైనా స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. నా పని పూర్తి చేశాను. ఇప్పుడు మీ( ఫాలోవర్స్) సమయం ఆసన్నమైంది. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ గారు అని నితిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. నితిన్ ప్రస్తుతం రంగ్ దే, బీష్మ చిత్రాలతో పాటు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa