విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' చిత్రం రూపొందింది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "నేను చేసిన 'డియర్ కామ్రేడ్' తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల కానుంది. అందువలన ఈ సినిమా నా కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను బాబీ పాత్రలో రష్మిక 'లిల్లీ' పాత్రలో కనిపిస్తాము. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది .. సినిమా చూస్తున్నప్పుడు మీరంతా కూడా కనెక్ట్ అవుతారని అనిపిస్తోంది. సంగీతం పరంగా కూడా ఈ సినిమా నా అభిమానులను మెప్పిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమా చూడటం ఎవరూ మిస్ కాకూడదు'' అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa