గత ఏడాది భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటాషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని, సరైన భాగస్వామి దొరికితే మళ్లీ లవ్‌లో పడేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. కాగా నటాషా విడాకుల తర్వాత తన ఫ్రెండ్ అలెగ్జాండర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.జీవితం ఏం అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు. "నమ్మకం, అవగాహనతో నిర్మితమైన అర్థవంతమైన సంబంధాలకు నేను విలువ ఇస్తాను. ప్రేమ నా ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను, అంతకుమించి ప్రేమ గురించి నిర్వచించలేం" అని తెలిపారు. ఇక, గత సంవత్సరం తనకు చాలా కష్టంగా గడిచిందని, హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను బాధించిందని నటాషా చెప్పారు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మరింత రాటుదేలుతామని, సవాళ్లను ఇష్టపడతానని వివరించారు. మనుషులు వయసుతో కాకుండా అనుభవాలతో పరిణతి చెందుతారని నటాషా అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |