సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలైంది. యాక్షన్ సన్నివేశంలోని ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఎన్‌కౌంటర్ సీన్ ప్రభాస్ పెట్టుకున్న కళ్లజోడులో కనిపించడం కొత్తగా అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, స్టిల్స్, పిక్స్, తొలి పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీలోనూ ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ సరసన శద్ధా కపూర్ నటిస్తున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa