ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 12న 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' గ్రాండ్ గా ఈవెంట్‌ : కళ్యాణ్ రామ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 10, 2025, 12:36 PM

నందమూరి కుటుంబంలో హీరోలను కలిసి చూడాలని అభిమానులు ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో కలసి కనిపించారు.మళ్లీ ఆ తర్వాత నుంచి బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు. గత కొంతకాలంగా బాబాయ్ - అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది. అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం పలు కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరోసారి ఈ అన్నదమ్ములు కలిసి ఓకే స్టేజి పైకి రానున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'దేవర 1' మూవీ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించడంతో ఆ రకంగా అయిన ఇద్దరు కలిసి కనిపిస్తారని భావించారు. కానీ ఈవెంట్ రద్దు అవ్వడంతో అభిమానులు ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ లోటును 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' సినిమాతో భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.


నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అయింది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న గ్రాండ్ గా రిలీజ్‌ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి, అందులో పాల్గొనే చీఫ్ గెస్ట్ గురించి అప్డేట్ అందించారు. ఏప్రిల్ 12న గ్రాండ్ గా ఈవెంట్‌ చేస్తామని.. తన తమ్ముడు తారక్ ఈ వేడుకకు రానున్నట్టు రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.'బింబిసార' సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ తర్వాత వచ్చిన 'అమిగోస్' మూవీ ప్లాప్ అయినప్పటికీ, 'డెవిల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకుంది. దాంతో ఈ సినిమాపైనే నందమూరి ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa