సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన "జాట్" సినిమా వీకెండ్కు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచింది.గోపీచంద్ సహా మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ కూడా హిందీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఇదే. అయితే డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ చిత్రం అదే నిలకడని కొనసాగిస్తూ వచ్చింది.ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా మంచి వసూళ్లు ఈ సినిమా అందుకుంటుంది. ఇలా ఆరో రోజు కూడా 6 కోట్లకి పైగా వసూళ్లు ఈ సినిమా అందుకోగా మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ 6 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ని దాటేసి మొత్తం 65.45 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదే ఫామ్ లో కొనసాగితే జాట్ డెఫినెట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa