తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'రెట్రో' అనే పీరియడ్ డ్రామాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెడ్జ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం మే 1వ తేదీన తమిళం మరియు తెలుగులో ఒకేసారి థియేట్రికల్ విడుదల కోసం షెడ్యూల్ చేయబడింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క కృష్ణ డిస్ట్రిక్ట్ రైట్స్ ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రెట్రోలో జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణకరన్, విద్యా శంకర్ ప్రముఖ పాత్రలలో ఉన్నారు. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. సాంకేతిక సిబ్బంది కెమెరాను శ్రేయాస్ కృష్ణ మరియు ఎడిటింగ్ షఫీక్ మహమ్మద్ అలీ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు జాకీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa