హసిత్ గోలి దర్శకత్వం వహించిన శ్రీవిష్ణు నటించిన 'స్వాగ్' విడుదలై మోస్తరు స్పందనను అందుకుంది. సూపర్‌హిట్ రాజా రాజ చోరా తర్వాత శ్రీవిష్ణు మరియు హసిత్ గోలీల కలయికలో ఈ చిత్రం రెండవది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో ఏప్రిల్ 27న సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటించింది. సాంకేతిక బృందంలో వేదరామన్ శంకరన్ (సినిమాటోగ్రఫీ), వివేక్ సాగర్ (సంగీతం), విప్లవ్ నిషాదం (ఎడిటింగ్), జిఎమ్ శేఖర్ (కళా విభాగం), మరియు నందు మాస్టర్ (స్టంట్స్) ఉన్నారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య, దక్ష నాగర్కర్, శ్రీను, గోపరాజు రమణ, సునీల్, రవి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa