నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కూటమి నాయకులకు క్షమాపణలు చెప్పినా కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం తగ్గడం లేదు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa