జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయింది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులోకి అడుగుపెడుతున్నారని తెలుపుతూ ‘ఎక్స్’లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో ఎన్టీఆర్ చాలా స్లిమ్‌గా కనిపించారు. ఈ మూవీ షెడ్యూల్ కోసమే ఎన్టీఆర్ సన్నబడ్డారని తెలుస్తోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ లుక్‌లో మాస్ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు కీలకతారాగణం పాల్గొననుంది. యాక్ష న్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ తెరకెక్కించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa