ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్‌ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటిరోజు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 03:04 PM

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్‌ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటిరోజు అని చెప్పారు. ఇలాంటి క్రూరమైన దాడికి వ్యతిరేకంగా మనమందరం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే పలువురు సినీ స్టార్లు ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa