నిత్యం వార్తల్లో ఉండే నటి రాధికా ఆప్టే. తాను కాస్త లావెక్కినందున ఓ సినిమాలో ఛాన్స్ కోల్పోయానంటూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఎఫ్ఎఫ్ షోలో పాల్గన్న అమ్మడు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన `విక్కీ డోనర్` సినిమాకి ముందు రాధికా అప్టేను హీరోయిన్‌గా ఎంపికచేసారూ ఆ చిత్ర దర్శకుడు. షూటింగ్ ఆరంభానికి సమయం ఉండటంతో మిత్రులతో కలసి ఆమె విహారయాత్రకు వెళ్లి బాగా తిని, బీరు తాగడంతో లావుగా తయారవ్వటంతో `విక్కీ డోనర్` నిర్మాతలు రాధికా ఆప్టేను ఆకారం చూసి నో చెప్పారట . తాను షూటింగ్ సమయానికి డైటింగ్, జిమ్ కు వెళ్లి బరువు తగ్గుతానని చెప్పినా నిర్మాత, దర్శకులు ససేమిరా అంతంతో పటు ఆ ఛాన్స్ కాస్త యామీ గౌతమ్‌కి ఇచ్చేసారు. . అయితే తనకు సినిమా చేజారినందుకు బాధగా అనిపించలేదని, బరువు పెరగడం వల్ల సినిమా అవకాశం పోవడంతో కోపం వచ్చిందని విలవిలా ఏడుస్తూ మీడియా కు తన బాధ రాధికా చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa