సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1,871 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ సీక్వెల్ అంచనాలను అధిగమించింది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా మే 31న రాత్రి 7:30 గంటలకి జీ సినిమాల్ ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మికా మాండన్న నటించారు. ఈ పాన్-ఇండియన్ డ్రామాలో ఫహద్ ఫాసిల్ క్రూరమైన విలన్ పాత్రను పోషించగా, సునీల్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, జగదీష్, బ్రహ్మాజీ మరియు రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించింది. థమన్, సామ్ సిఎస్ మరియు ఇతరుల అదనపు సహకారాలతో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa