ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రచ్చరవి కూడా అందుకే 'జబర్దస్'కి దూరమయ్యాడు : షేకింగ్ శేషు

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 12:56 PM

తెలుగు వారిని కడుపుబ్బా నవ్వించే కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా చాలా మంది కామెడీయన్స్ కి పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కాయి అనడంలో అతిశయోక్తి లేదు.  అయితే అలాంటివారి జాబితాలో షేకింగ్ శేషు ఒకరుగా కనిపిస్తాడు. ఇటీవల కాలంలో ఆయన 'జబర్దస్త్' వేదికపై కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అందుకు గల కారణాన్ని గురించి వివరించాడు.


'జబర్దస్త్' కార్యక్రమం మా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాల నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అయితే అటు సినిమాలు .. ఇటు 'జబర్దస్త్'ను చేయడం కష్టమవుతోంది. డేట్స్ కుదరకపోవడం వలన ఏదో ఒకటి వదులుకోవలసి వస్తోంది. అందువలన నేను 'జబర్దస్త్' ను వదులుకోవలసి వచ్చింది. 'రచ్చ రవి' కూడా ఈ కారణంగానే 'జబర్దస్త్'కి దూరమయ్యాడు' అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa