ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తూ దేశ్‌ మేరా’ అంటున్న బాలీవుడ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 07:05 PM

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్‌ తారలు సిద్దమయ్యారు. అందుకోసం వారంతా ఓ వీడియో సాంగ్‌లో కనిపించనున్నారు. ‘తూ దేశ్‌ మేరా’ అని సాగే ఈ పాటలో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణబీర్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు కనిపించనున్నారు. ఎంతో బిజీగా ఉండే తారలు.. అమర జవాన్లకు నివాళులర్పించడానికి తమ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది.


73వ స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్క రోజు ముందుగా ఈ వీడియో సాంగ్‌కు సంబంధించి కవర్‌ పోస్టర్‌ను సీఆర్పీఎఫ్‌ ట్విటర్‌ ద్వారా  విడుదల చేసింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న బాలీవుడ్‌ తారలకు ధన్యవాదాలు తెలిపింది. సీఆర్పీఎఫ్‌ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో బాలీవుడ్‌ తారలు జవాన్లకు సెల్యూట్‌ చేస్తూ కనిపించారు. ఈ పాట కోసం సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నౌటియల్, షబాబ్ సబ్రి, కబీర్ సింగ్‌లు తమ గళం విప్పారు. మీట్ బ్రోస్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa