అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఇటీవల మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో మహేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్ర బృందం.. తాజాగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సాగిన ఈ వీడియోలో 1971 ఇండో-పాక్ వార్, సియాచిన్ వివాదం, కార్గిల్ యుద్ధం, 2016 సర్జికల్ స్ట్రైక్స్ చిత్రాలను చూపించారు. ఆయా దృశ్యాలన్నీ రోమాంచితంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మహేశ్ ఆర్మీ అధికారి మేజర్ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్ సాంగ్ అభిమానులను అలరిస్తోంది.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి అగ్ర కథానాయిక విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే సెట్‌లోకి అడుగుపెట్టారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa