కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. కమల్‌హాసన్ - మణిరత్నం కాంబోలో 36 సంవత్సరాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష కథానాయిక. జోజు జార్జ్‌తో పాటు హీరో గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa