తన కుటుంబం మొత్తం కలిసి కూర్చొని భోజనం చేయాలని, ప్రేమగా మాట్లాడుకునే రోజు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తానని నటుడు మంచు మనోజ్ అన్నారు. ‘భైరవం’ ప్రమోషన్స్‌లో భాగంగా పాడ్‌కాస్ట్‌లో పలు విషయాలు పంచుకున్నారు. 'నా కుమార్తెను నాన్న ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా. నాన్నంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనపై ఎలాంటి కోపం లేదు. అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. అమ్మను కలవాలంటే పలు కండిషన్స్ పెట్టారు. గొడవల కారణంగా అక్కను దూరం పెట్టాను' అని చెప్పుకొచ్చారు.