ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ ఇంట్లో ఏడుపుల పర్వం

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 12:45 PM

గురువారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో గొడవలు మరియు ఏడుపుల పర్వం కొనసాగింది. గురువారం ఎపిసోడు లో వరుణ్ తో వాగ్వాదం జరగడంతో వితిక చాలాసేపు భోరున ఏడుస్తూనే ఉంది. మొన్న టాస్క్లో ఏదొక విషయం మీద వరుణ్ వితికకు క్లాస్ పీకడంతో గొడవ మొదలైంది. అసలు నువ్ నాతో మాట్లాడొద్దు నన్ను కాసేపు వదిలేయని వితిక చెప్పిన వరుణ్ ఏదొకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ‘టైం స్పెండ్ చేయి.. టైం స్పెండ్ చేయి అంటే ఏం మాట్లాడుతున్నావ్. మనం వచ్చింది బిగ్ బాస్ షోకి హనూమూన్ కి కాదు. అది నీకు అర్ధం అవుతుందా ? అని వితికాను వరుణ్ మరింత రెచ్చగొట్టాడు. దీంతో వితిక ఓ రేంజ్ లో ఏడుస్తూ వరుణ్ మీద రైజ్ అయింది. ‘ నేను నాతోనే ఉండమని అనడంలేదు. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్లి మాట్లాడుకో ’ అంటూ గట్టిగా అరిచింది. ఈ దెబ్బకి వరుణ్ కూడా సీరియస్ అయ్యాడు. ప్రతి దాన్ని బూతద్దంలో చూస్తే ఇలాగే ఉంటుంది. ప్రతిదీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావ్’ అంటూ మండిపడ్డాడు. ఇక వితిక వరుణ్ కు గట్టిగా సమాధానం ఇచ్చింది. ‘నేను ఎవరి గురించో మారను.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా.. నేను హర్ట్ అయ్యేటట్లు నువ్ మాట్లాడకు. నువ్ ఎందుకు నాకు చెప్తున్నావ్. దయచేసి నువ్ నాతో మాట్లాడకు నన్ను ఇలా వదిలెయ్. నన్ను రెచ్చగొట్టకు. నువ్ నన్ను ఎందుకు అర్ధం చేసుకోవడం లేదు’ అంటూ పెద్దగా అరిచింది. ఈ క్రమంలో వాగ్వాదం మరింత పెరగడంతో వితిక గట్టిగా ఏడుస్తూ బాత్రూమ్ కి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చింది. ఇక కాసేపటి తర్వాత వరుణ్ బాత్రూంకి వెళ్లి కూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వితిక అలాగే ఉంది. అయితే చివరికి వీరిద్దరికి బాబా భాస్కర్ చిన్నగా క్లాస్ తీసుకోవడంతో కూల్ అయ్యారు.  వీరి ఎపిసోడ్ ఇలా జరిగితే జైలులో ఉన్న రాహుల్ నిద్రపోవడంతో కుక్కలు  మోరిగాయి. దీంతో పునర్నవి వాడి మీద వాటర్ కొట్టమని రవికి చెప్పింది. ఇక రవి వాటర్ కొట్టేందుకు ప్రయత్నించగా అదొక మెంటల్ ది... అలాగే చెబుతుంది అని అనడంతో పున్నూ హార్ట్ అయింది. రాహుల్ నోరు జారుతున్నావ్ అని చెబుతూ ఏడుస్తూ బాత్రూమ్ లోకి వెళ్ళి ఫుల్ గా ఏడ్చింది. గురువారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో గొడవలు,ఏడుపులతో సాగింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa