ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ చైతన్య 'సవ్యసాచి' ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 02:59 PM

నాగ చైతన్య 'సవ్యసాచి'  ఫస్ట్ లుక్ .నాగచైతన్యకు ‘ప్రేమమ్’ రూపంలో చందూమొండేటి గత ఏడాది మంచి విజయాన్ని అందించాడు. ఆ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతూ ‘సవ్యసాచి’రూపంలో వస్తోంది. ఇప్పటికే ప్రీ లుక్, టైటిల్ లోగోతో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. హై వోల్టేజ్ థ్రిల్లర్ లా ఉండబోతోంది ఈ సినిమా అనే ఇండికేషన్స్ ఇప్పటికే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు మరింత బలాన్ని ఇస్తోంది ఈ సినిమా తాజా పోస్టర్.


రేపు నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ప్రేమమ్ వంటి రీమేక్ ను కూడా తన టేకింగ్ తో ప్రత్యేకంగా నిలిపిన చందూ.. ఈ సినిమాతో చైతూకు మరో హిట్ ఇవ్వడంలో ప్రామిసింగ్‌గానే కనిపిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa